ATP: సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశామని సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో ఈనెల 18న జరగనున్న సీపీఐ శతాబ్ది వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.