GNTR: కొల్లిపర మండలం చిలుమూరు వద్ద శనివారం రాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. చక్రాయపాలెం వైపు వెళ్తున్న ఈ వాహనాలపై కేసు నమోదు చేసి, నిందితులపై క్రిమినల్ చర్యలు చేపట్టారు. అక్రమ రవాణా చేసే వారిని వదిలిపెట్టబోమని పోలీసులు హెచ్చరించారు.