NLR: చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామంలో ఆదివారం ఉదయం 10 గంటలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు సంబంధిత అధికారులు పాల్గొంటారు.