GNTR: పొన్నూరు పట్టణంలోని 2, 13, 16, 18 వార్డుల్లో సుమారు రూ. 92.50 లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ శనివారం శంకుస్థాపనలు చేశారు. జనసేన నేత మార్కండేయ బాబు, మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబుతో కలిసి ఆయన ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.