E.G: దేవరపల్లి (M) దుద్దుకూరులో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కూటమి నాయకులు శనివారం పంపిణీ చేశారు. మోకాళ్ల శస్త్రచికిత్స నిమిత్తం మంజూరైన రూ.70 వేల చెక్కును ఆంజనేయులుకు, రూ.50 వేల చెక్కును హేమావతికి TDP నేత తాతారావు అందజేశారు. ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఆపన్నహస్తంలా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.