VSP: ఎన్ఏడీలో ఏర్పాటు చేసిన వెస్ట్‌జోన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గణబాబు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం ప్రారంభించారు. నగర ప్రజలకు మరింత సమర్థవంతంగా మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు చేరువలో రాజకీయ నాయకులు, అధికారులు ఉంటే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఫలాలు అందరికీ అందుతాయిని తెలిపారు.