W.G: డ్రైవర్ సంస్థకు వెన్నెముక లాంటివారని, చలికాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, రోడ్డు భద్రతా సూక్తులు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా భీమవరం బస్టాండ్లో సదస్సులో ఆయన మాట్లాడారు. ఎక్కడైనా ప్రమాదం సంభవిస్తే అక్కడున్న వారు బాధితులను వైద్యం నిమిత్తం సహకారం అందించాలని కోరారు.