E.G: కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలో శనివారం జరిగిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ధర్మవరం గ్రామానికి చెందిన సుమారు 798 మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేశామని తెలిపారు. రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నట్లు చెప్పారు.