MBNR: పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ జాబితాలోని తప్పులను సరిచేయాలని BRS పట్టణ అధ్యక్షుడు శివరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీశ్రేణులతో కలిసి కార్పొరేషన్ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఓటర్ జాబితా తప్పులతడకగా ఉందని, ఇతర ప్రాంతాలకు చెందినవారి పేర్లను లిస్టులో నమోదు చేశారని పేర్కొన్నారు. అలాగే వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదని ఆరోపించారు.