MBNR: మిడ్జిల్ మండలం చౌటకుంట తండాలో ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ నిర్మాణ పనులను హౌసింగ్ ఏఈ మహేష్ శనివారం పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతలు, నాణ్యత ప్రమాణాల ప్రకారమే ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలత, పంచాయతీ కార్యదర్శి అర్షద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.