MNCL: వరి పంట విషయంలో రైతులు నూతన పద్ధతులను అవలంబించడమే ఉత్తమమని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈఓ అక్రమ్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. యాసంగి సీజన్‌కు సంబంధించిన వ్యవసాయ పనుల్లో రైతులు బిజీగా ఉన్నారన్నారు. వరి విషయంలో నారు నాటడం, డ్రమ్ సీడ్, వెదజల్లే పద్ధతులు ఉన్నాయన్నారు. నూతన పద్ధతులతో అధిక దిగుబడి సాధించవచ్చని, ఏఈఓలను సంప్రదించాలని కోరారు.