WG: భీమవరంలో 2 రోజులపాటు జరిగే గోదావరి క్రీడా ఉత్సవాలను శనివారం కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. మండల, డివిజన్ స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన బృందాలు జిల్లా స్థాయిలో తలపడనున్నాయి. శని, ఆదివారాల్లో క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, చెస్, టెన్నికాయిట్, త్రో బాల్, క్యారమ్స్, షాట్ ఫుట్ వంటి 9 క్రీడాంశాలలో 235 బృందాలు పాల్గొంటారని తెలిపారు.