KRNL: ఆదోని–2 మండలానికి నూతనంగా నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నూతన కార్యాలయం ఉపయోగపడుతుందని వారు తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.