SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి వీరభద్ర స్వామి వారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా పూర్ణాహుతి చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హోమ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.