గద్వాల్ జమ్మిచేడులో వెలసిన శ్రీ జమ్ములమ్మ ఆలయాన్ని గద్వాల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ నల్ల హనుమంతు శనివారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనను ఆలయ కమిటీ ఛైర్మన్, ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికి శ్వేత వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు.