NLG: దేవరకొండలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం తరలించుకు పోతుంటే సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడంలేదని అన్నారు. కృష్ణా జలాల విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.