WGL: జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆదేశాల మేరకు ఖిలా వరంగల్ (M) కేంద్రంలోనీ మామునూరు MJP గురుకుల పాఠశాలను శనివారం తహసీల్దార్ ఇక్బాల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పాఠశాల సిబ్బందికి ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.