కృష్ణా: మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజలు తమ సమస్యలు వినతిపత్రాలను సోమవారం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి సమస్యను చట్ట పరిధిలో న్యాయ సమ్మత పరిష్కారం అందిస్తామని తెలిపారు. ప్రజల ఫిర్యాదు విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.