JN: ప్రయాణికులు రహదారి భద్రతా నియమాలను విధిగా పాటించినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమని నర్మెట్ట సీఐ అబ్బయ్య, బచ్చన్నపేట ఎస్సై హమీద్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అతివేగం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.