SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో జరిగే త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఆది శ్రీనివాస్‌ను మంగళవారం ఆలయ ఈవో రమాదేవి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. స్వామివారి ప్రసాదంతో పాటు ఆరాధన ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.