ATP: గుత్తి పట్టణంలోని అమృత థియేటర్ వెనుకల మట్కా స్థావరంపై పోలీసులు శనివారం మెరుపు దాడులు చేశారు. ఎస్. ఐ సురేష్ మాట్లాడుతూ.. మట్కా రాస్తున్నారని తమకు వచ్చిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి దాడులు చేశామన్నారు. అందులో భాగంగా 6 మంది మట్కా బీటర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.40 వేల నగదు మట్కా చీటీలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని ఆయన తులిపారు.