CTR: పుంగనూరులోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో TTD ఆధ్వర్యంలో శనివారం పౌర్ణమి గరుడసేవ నిర్వహించారు. ఉత్సవ మూర్తిని గరుడ వాహనంపై పట్టణంలో ఊరేగించారు. హై స్కూలు, కట్టకిందపాలెం, నగరి వీధి ప్రాంతాలలో స్వామివారిని మేళతాలాలతో ఊరేగింపు జరిపారు. భక్తులు కర్పూర హారతులతో స్వామివారిని కొలిచారు.ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, అర్చకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.