TG: ప్రస్తుతం పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు అనుమతుల గురించి ప్రధాన చర్చ సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఈ ప్రాజెక్టుకు కేసీఆర్కు సంబంధం లేదు. ఈ ప్రాజెక్టు కోసం మాజీ ఎంపీ విఠల్ రావు మొట్టమొదటి సారి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి లేఖ రాశారు. ఆయనకు ఉన్న పరిచయంతో 2009లో ఈ ప్రాజెక్టు పునాది పడేలా చేశారు’ అని గుర్తు చేశారు.