సత్యసాయి: లేపాక్షి మండలం వెంకటాపురం గ్రామంలో గ్రామీణ క్రికెట్ క్రీడాకారుల కోసం బాలయ్య ప్రీమియర్ లీగ్–2026 టోర్నమెంట్ నిర్వహించనున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతో, టీడీపీ లేపాక్షి మండల అధ్యక్షుడు అభిలాష్ జన్మదిన సందర్భంగా ఈ టోర్నమెంట్ జరగనుందని జనవరి 8న ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు.