బంగ్లాదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. దాముద్యా ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల ఖోకన్ చంద్ర దాస్ అనే హిందూ వ్యాపారిపై దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల నుంచి తప్పించుకునేందుకు ఆయన చెరువులో దూకినప్పటికీ, తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.