విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విధ్వంసం సృష్టించాడు. కేవలం 68 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఔరా అనిపించాడు. ముఖ్యంగా సెంచరీకి చేరువలో ఉండగా ఒకే ఓవర్లో వరుసగా 6, 6, 6, 6, 6, 4 బాది ఏకంగా 34 పరుగులు రాబట్టడం హైలైట్గా నిలిచింది. హార్దిక్ ధాటికి బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఈ ఇన్నింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.