AP: తెలుగు భాష ప్రభుత్వానికి అధికార భాష, తమకు మమకార భాష అని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ తరఫున మూడోసారి ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన వంటి వారు తెలుగు భాషకు పట్టం కట్టారని చెప్పారు. ఎన్టీఆర్, రామోజీరావు తెలుగుకు గుర్తింపు తెచ్చిన వారిలో ప్రముఖులని కొనియాడారు.