HNK: శాయంపేట మండలం నేరేడుపల్లికి చెందిన మేకల బన్నీ (19) అవమానం భరించలేక నిన్న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. SI పరమేశ్వర్ వివరాల ప్రకారం.. అక్క భర్త గణేష్, మామ, బంధువు భాస్కర్ దుర్భాషలాడి దాడి చేయడంతో బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబ సభ్యులు MGM ఆసుపత్రికి తరలించగా ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముగ్గురి పై పోలీసులు కేసు నమోదు చేశారు.