HYD: మహిళల విద్యాభివృద్ధికి సావిత్రిబాయి ఫూలే చేసిన సేవలు అనన్యమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కొనియాడారు. ఫిలింనగర్లో ఆమె విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. సావిత్రిబాయి జయంతిని ప్రభుత్వం ‘మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం’గా ప్రకటించడం సంతోషకరమన్నారు. మహిళా శక్తికి ఆమె నిదర్శనమని పిలుపునిచ్చారు.