యాదాద్రి: రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా శ్రవణ్ నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రామన్నపేట మాజీ జడ్పీటీసీ జినుకల ప్రభాకర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తానని వెల్లడించారు. బార్ అసోసియేషన్ ఆయనకు అభినందనలు తెలిపింది.