JGL: కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో మల్లన్న పట్నాల పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో ముఖ్యంగా యాదవుల కుల దైవమైన మల్లన్న స్వామిని పూజించి భక్తిశ్రద్దలతో చేసే సంప్రదాయ పండుగ. ఒగ్గు పూజారులు పట్నాలు వేసి, బోనాలు సమర్పించి, డప్పు చప్పుళ్లతో, ఒగ్గు కథలతో స్వామివారిని కొలిచారు. పెద్దపట్నం, మైల పట్నం వేసి మొక్కులు తీర్చుకున్నారు.