E.G: ఉచిత ఇసుక పాలసీ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని గుర్తించి ప్రజలకు ఉచిత ఇసుక పంపిణీ చేయడంపై దృష్టి సారించాలని రాష్ట్ర ఎక్సైజ్ మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రిలో మైన్స్ శాఖ పనితీరుపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో ఇసుక విధానాల్లో జరిగిన లోపాల కారణంగా భవన నిర్మాణ రంగం వెనుకబడిందని అన్నారు.