MDK: కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘ఆశా డే’ సందర్భంగా టీబీ (క్షయ) వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీబీ స్టేట్ కో ఆర్డినేటర్ డాక్టర్ స్నేహశీల మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో టీబీ లక్షణాలను గుర్తించడంలో ఆశా కార్యకర్తల పాత్ర కీలకమని పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణ, చికిత్సపై వారికి దిశానిర్దేశం చేశారు.