BHPL: పురపాలక తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఇవాళ ఐడీవోసీలో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా స్వచ్ఛత ప్రజాస్వామ్యానికి కీలకమని, అర్హుల పేర్లు చేర్చి, అర్హతలేని పేర్లు తొలగించేందుకు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని కోరారు.