MBNR: గండీడ్, మహ్మదాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాలో విలీనం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కోరారు. దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ.. క్యాబినెట్ సమావేశంలో చర్చించి త్వరలోనే విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ప్రకటనపై ఉమ్మడి మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.