ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని 2వ వార్డులో రూ. 12 లక్షలు, అలాగే 12వ వార్డులో రూ. 10లక్షల వ్యాయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. మార్కాపురం నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని, గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు.