HYD: సైబర్ నేరగాళ్లు ఏకంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పేరుతో ఫేస్ బుక్‌లో ఫేక్ ఎకౌంట్ సృష్టించి కలకలం రేపారు. ఉన్నతాధికారుల పేర్లతో డబ్బులు వసూలు చేసేందుకు ఈ ముఠాలు ప్రయత్నిస్తున్నాయి. విషయాన్ని గుర్తించిన పోలీసులు అప్రమత్తమై, ఆ ఖాతా నుంచి వచ్చే రిక్వెస్ట్‌లను నమ్మవద్దని సూచించారు.