SKLM: ఎమ్మెల్యే కూన రవికుమార్ టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు శిక్షణా తరగతులలో ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.