HYD: మృత్యువును జయించి ఆరుగురికి ఊపిరి పోసిన సంఘటన ఇది. నల్గొండ జిల్లాకు చెందిన ఏరుకొండ లింగయ్య రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయినా.. భార్య యాదమ్మ గుండె నిబ్బరంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. భర్త తిరిగిరారని తెలిసినా ఇతరుల రూపంలో ఆయన జీవించాలన్న ఆశతో కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, కళ్లను దానం చేసి ఆరుగురికి ప్రాణం పోయారని సీపీ సజ్జనార్ తెలిపారు.