KKD: తుని పట్టణంలోని డీ మార్ట్ సమీపంలో శనివారం ఉదయం ఓ ప్రమాదం చోటుచేసుకుంది. సత్తిబాబు డీ మార్ట్ పక్కనున్న ఓ పాత సామాన్ల గోడౌన్లో పనిచేస్తున్నాడు. ఉదయం గోడౌన్‌కు నడిచి వెళ్తుండగా వేనుకనుంచి బైక్ బలంగా ఢీకొంది. సీతారాంపురం ప్రాంతానికి చెందిన వెలుగుల సత్తిబాబు(55) ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై, మృతి చెందాడు.