ELR: చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో శనివారం మాత సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సావిత్రిబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళ అభివృద్ధికి ఆమె ఎనలేని కృషి చేశారని అన్నారు.