TG: కొండగట్టు తనకు పునర్జన్మ ఇచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. కొండగట్టు ఆంజనేయస్వామి అంటే తనకు అపారమైన నమ్మకమన్నారు. హైటెన్షన్ వైర్ల నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి తనను కాపాడారన్నారు. కొండగట్టు అభివృద్ధికి సహకరించిన టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. కొండగట్టు గిరిప్రదక్షిణకు తన వంతు సాయంతో పాటు కరసేవ కూడా చేస్తామని హామీ ఇచ్చారు.