W.G: పాలకొల్లులోని దివ్యనగరంలో వేంచేసియున్న శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలో శ్రీనువాసరావు వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం 19వ రోజు శ్రీమాన్ కరి పవన్ స్వామి వారు శ్రీస్వామివారిని శ్రీరంగనాథరాజుగా అలంకరించి ఆగమోక్తంగా పూజలు చేశారు. శ్రీమాన్ రంగనాథ స్వామి వారు తిరుప్పావై ప్రవచనం చేశారు.