W.G: తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి సంబంధిత వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.