E.G: రాజమండ్రిలోని పుష్కరాల రేవులో మెగాస్టార్ ఫాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్’ మూవీ ప్రమోషన్ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు.