MBNR: జిల్లాకు చెందిన ప్రముఖ రంగస్థల కళాకారుడు డా. ఆచార్య కోట్ల హనుమంతరావును ‘సరిలేరు నీకెవ్వరు’ విశిష్ట పురస్కారం వరించింది. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో రాజో-విభొ-కందాళం సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు అవార్డుతో పాటు రూ.25 వేల నగదును అందజేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు ‘జీవిత చరిత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.