BDK: కరకగూడెం మండలంలోని సొసైటీ సబ్ సెంటర్ వద్ద శనివారం ఉదయం నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరారు.యాసంగి సాగుకు ఎరువులు అత్యవసరమవడంతో,పనులన్నీ మానుకుని క్యూలో నిలబడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రబీ సీజన్లోనూ తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమవుతోందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి సకాలంలో అందించాలిన్నారు.