AP: రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సర ఆరంభంలోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడం శుభపరిణామమని, ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని తన ‘X’ ఖాతాలో పేర్కొన్నారు. దేశీయ పెట్టుబడుల్లో ఏపీ ప్రథమ స్థానంలో నిలవడం ప్రజలకు శుభవార్త అని పేర్కొన్నారు.