TG: జూరాల నుంచి శ్రీశైలానికి ప్రాజెక్ట్ సోర్స్‌ను కావాలనే మార్చారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. ఈ మార్పు కారణంగా అంచనాలు రూ.84 వేల కోట్లకు పెరిగాయని తెలిపారు. జూరాల దగ్గర 414 మీటర్ల ఎత్తులో 22 పంపులతో నీళ్లు తీసుకోవచ్చని.. శ్రీశైలంకు మార్చడం వల్ల 560 మీటర్ల ఎత్తులో 37 పంపులు అవసరమవుతాయన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువగా కృష్ణా నీటి వినియోగం జరిగిందని చెప్పారు.