SRD: కంగ్టి మండలం నాగూర్ కే పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మహానంద, హెచ్ఎం రవీందర్ సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామస్తుల సహకారంతో విద్యార్థులకు టైలు, బెల్టులు, ఐడి కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.